గరికిపాటి

మహా సహస్రావధాని,సాహిత్యవేత్త, పుంభావ సరస్వతి, అసాధారణ ధారణా నిపుణ,అవిరళ కవితా సాగర ఘోష యాత్రాతత్పర బ్రహ్మశ్రీ
గరికిపాటి నరసింహా రావు, ఎమ్.ఎ., పి.హెచ్.డి. మహోదయులకు
వాగ్గేయకార కళావైభవము సంగీత రూపకర్త వేదుల బాలకృష్ణమూర్తి వ్రాయు ఆశీరభినందన.

తే.గీ.
వర సహస్రావధాని మా గరికిపాటి
వర మహా సహస్రఫణి మా గరికిపాటి
గగన వీధి విహారి మా గరికిపాటి
కల్పనానల్ప కవిత మా గరికిపాటి.

తే.గీ.
పరమ భావుకతా మూర్తి గరికిపాటి
సరస సాహితీమయ మూర్తి గరికిపాటి
వరద శేముషీ విభవమ్ము గరికిపాటి
సరస వాగ్వైభవాకృతి గరికిపాటి.

తే.గీ.
సరసకవి కోటిలో మేటి గరికిపాటి
గాంగ నిర్ఘర వాగ్ధాటి గరికిపాటి
గళవిపంచికా స్వరపేటి గరికిపాటి
సరస కవితల సురఝురి గరికిపాటి.

తే.గీ.
కడమలేని సాగర ఘోషగరికిపాటి
కడలి కెరటాల ధారణ గరికిపాటి
కళల పదకేళి రసకేళి గరికిపాటి
కవికులాబ్ధి సుధానిధి గరికిపాటి.

తే.గీ.
ఆయురారోగ్య భోగభాగ్యములనొసగి
సతము గరికిపాటిని బ్రోచు శారదాంబ;
కరము శుభకరమగు పద్య సరసిజముల
కృతిని యొసగె వేదుల బాలకృష్ణమూర్తి.


18-1-2007,
శ్రీకాకుళం (వ్రాయసకాడు) - నరసింహ

6 కామెంట్‌లు:

krishna rao jallipalli చెప్పారు...

అప్పట్లో ఉషశ్రీ ఉపన్యాసాలు గాని, ప్రవచనాలు గాని ఎలా ఉండేవో... ఇప్పుడు గరికిపాటి. అద్బుతమైన వక్త.

Unknown చెప్పారు...

అవునండి.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

గరికపాటి వారి విద్వత్తుకు,మేధకు తగినవిధంగా ఉంది మీ ఆశీరభినందన.

అజ్ఞాత చెప్పారు...

కృష్ణారావు గారు చెప్పినట్టు అద్భుతమైన వక్త గరికిపాటి వారు. ఈటీవీ2 లో తెలుగువెలుగులోను, భక్తి టీవీలో వారి కావ్య పరిచయ కార్యక్రమం ద్వారాను, తెలుగు కావ్యాల గొప్పదనాన్ని, పద్యాల మధురిమనూ తెలుగువారికి పంచుతూ నాబోంట్లకు కూడా పద్య పఠనాసక్తిని కలుగజేస్తున్నారాయన.

ఇతర కార్యక్రమాల ద్వారా, ఇతర ఛానెళ్ళ ద్వారా తాము చేస్తున్న పాపాలను గరికిపాటివారి కార్యక్రమాల ద్వారా కడిగేసుకుంటున్నారు ఆయా చానెళ్ళ వారు.

అజ్ఞాత చెప్పారు...

మా కాలేజీ వారి పుణ్యమా అని ఈయనిని మరియు బేతవోలు రామబ్రహ్మం గారిని కలుసుకొనే అవకాశం కలిగింది మాకు.

"ఆల్ ఔట్ " మీద "హిట్" మీద కూడా పద్యాలూ చెప్పి సభికులని తెగ నవ్వించారు గరికిపాటి వారు

పురాణాలలోని విషయాల్ని సామాన్యుల భాష లో మనసుకు హత్తుకొనేలా చెప్పడం లో గరికిపాటి వారు ఘనాపాటి .
ఆయన ద్వారానే తెలుగు పద్యాల మీద ఆసక్తి కలిగింది. వీరు పద్యాల ద్వారా మనల్ని ఆలోచింపచేస్తారు
ఔరా ఇంత సులభంగా పద్యాలు చెప్పవచ్చునా అనిపించేంత ఆశువుగా పద్యాలు చెప్తారు వీరు .
ఎందఱో మహానుభావులు అందరికీ వందనాలు

Aditya Vinnkota చెప్పారు...

Chala Bagundi Andi garika pati vari gurunchi me kavitha malika

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates