మేడసాని మోహన్

మహా పంచ సహస్రావధాని ,టి।టి।డి। అన్నమాచార్య ప్రోజెక్టు డైరెక్టరు శ్రీయుతులు మేడసాని మోహన్ గారికి
ఆశీరభినందనలు

తే॥గీ॥
మేటికవి "పంచసాహస్రి" మేడసాని
మింటి నిర్ఝర వాగ్ఘరి మేడసాని
మిన్ను ముట్టెడి ప్రతిభయే మేడసాని
మించు రసమయ కవితయె మేడసాని


తే॥గీ॥
మీ సములమంచు చెప్పగా మేడసాని
మీసములు ఉన్న కవులేరి మేడసాని
లేడు నీ సరి కవి నేడు మేడసాని
లేడు లేడు నీ సరిజోడు మేడసాని
తే॥గీ॥
మేరు శిఖరమ్ము కవితకు మేడసాని
మేటి ధారణా పటిమకు మేడసాని
ఏడుకొండల రాయడు మేడసాని
ఏడుగడ మీకు అవధాని! మేడసాని!!

వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

1 కామెంట్‌లు:

చైతన్య.ఎస్ చెప్పారు...

నరసింహం గారు మేడసాని గారి అవధానం నేను రెండు,మూడు సార్లు చూశా. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates