జడ అల్లి జడకుచ్చు జయదేవు డమరింప

వాగ్గేయకారులు శారదామాత కు
  సమర్పించిన ఆభరణములు
సీసము.
జడ అల్లి జడకుచ్చు జయదేవు డమరింప
తీర్థ నారాయణ తిలక మిడియె
వజ్రంపు ముక్కెర వర పురందరు డీయ
రత్నహారములు క్షేత్రయ్యఁ యొసగె
పట్టు చీరను ముత్తుస్వామి అర్పింప జ
ల్తారు రైక నొసంగె అన్నమయ్య
రత్న కిరీటమ్ము రాందాసు ఒసగ ము
త్యాల హారము లిచ్చె శ్యామశాస్త్రి

తేటగీతి.
రత్న సింహాసనము త్యాగరాజు కూర్ప
స్వర్ణ కంకణముల నిచ్చె స్వాతి ప్రభువు
సర్వభూషణాలంకృత శారదాంబ
వసుధ సంగీత వాణియై వరలు గాక !

శ్రీకాకుళం
5-11-2009

3 కామెంట్‌లు:

Satya Narayana Sarma IRTS చెప్పారు...

భావన, కూర్పు అద్భుతంగా ఉన్నాయి వేదుల గారు.

శ్రీలలిత చెప్పారు...

శారదాదేవి సర్వాలంకరణ భూషితురాలై సాక్షాత్కరించినట్టుంది.....చాలాబాగుందండీ

Unknown చెప్పారు...

ధన్యవాదాలండీ.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates