చెప్పే విషయాన్ని అందంగా చెపితే అది కవిత్వం ఔతుంది.
ఆ కవితను ఛందస్సులో చెపితే అది పద్యం అవుతుంది.
ఆరు వేదాంగాలలో ఒకటి ఐన ఛందస్సు పవిత్రం.
పవిత్ర ఛందస్సు సూత్రాలతో రచింపబడు పద్యం పవిత్రం.
గణ యతి ప్రాసలతో పద్యానికి వస్తాయి శృతిలయలు.
అందుకే రాగయుక్తంగా పాడడానికి అనుకూలం పద్యం.
తెలుగు ఛందస్సులో వున్న పద్యసంపద శతసహస్రాధికం.
కవులు తమ హృదయసీమల్లో చేస్తారు పద్యాల సేద్యం.
కవులు భాషాపాండిత్యాలను ఇస్తారు పద్యానికి నైవేద్యం.
గద్యం కన్నా ఎక్కువ గౌరవాన్ని పొందుతోంది పద్యం.
తెలుగువారికి దేవుడిచ్చిన గొప్పవరం పద్యం.
కవుల భావనా చమత్కృతితో పద్యం అవుతుంది హృద్యం.రచన : వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు - మల్లిన నరసింహారావు )
శ్రీకాకుళం,
తే 16-07-2009 ది.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి