సర్వజిత్తు సంవత్సరాది

సీ:
ఉదయాద్రి శిఖరాన ఉదయభాస్కరు దివ్య
పాదపద్మములకు ప్రణతులొసగి
మలయాద్రి పైవీచు మలయ మారుతముతో
నీలి మేఘాలలో తేలియాడి
మధుమాస కుసుమాల మధుకరీ బృందాల
సరసన తేనియల్ సంగ్రహించి
గున్నమావిని కూయు కోవిల పాటకు
స్వరరాగ మధురిమల్ సంతరించి.
తే.గీ:
జైత్రయాత్రకు వెడలుచు చైత్రమాస
శుక్లపక్షము పాడ్యమి శుభదినమున
తెలుగు ముంగిళ్ళ తెలుగుల వెలుగునింప
వచ్చినది సర్వజిత్తు సంవత్సరాది.

చ:
వరము లొసంగు కోరికను వచ్చె ఉగాదిని సర్వజిత్తు; శ్రీ
కరముగ శాంతి, సౌఖ్యములు కల్గగచేయుచు సర్వజిత్తునన్
వరముల నిచ్చుగాక; నవవర్ష ఫలంబుల సర్వజిత్తు
త్సరమిది భాగ్యదాయకము; స్వాగతమీయరె సర్వజిత్తుకున్.

తే.గీ:
సర్వజిత్తుకు సర్వత్ర జయము!జయము!
తెలుగు ప్రజలకు సర్వదా కలుగు జయము!
స్వాగతము సర్వజిత్ నూత్న వత్సరంబ!
స్వాగతము కొమ్ము మాకు శుభములిమ్ము!

సర్వజిత్తు ఉగాది
౨౦-౩-౨౦౦౭

3 కామెంట్‌లు:

Pradeep Miriyala చెప్పారు...

Ugaadi vachi aaru nelalu ayyidhi kadaa!!!!

చిన్నమయ్య చెప్పారు...

@ మిరియాల: వేదుల వారుండేది శ్రీకాకుళంలో, వారి వయస్సు 90 వసంతాలు. వారి తరఫున వీటిని బ్లాగాక్షరబద్ధం చేస్తున్నది శ్రీ నరసింహ గారు, ఉండేది పెద్దాపురం (తూగోజి) అనుకుంటాను. ఆలస్యం అయినా ఆహ్లాదంగా చదూకోచ్చుగా! నమస్తే.

Pradeep Miriyala చెప్పారు...

ప్రచురణలో ఆలస్యమన్నమాట...
పెద్దాపురం, పక్కనే మ ఊరు పిఠాపురం

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates