విరోధి సంవత్సరాది

సీ.
విలసిల్లవలె నేడు విశ్వవిఖ్యాతమౌ
భారత సంస్కృతీ ప్రాభవమ్ము
వికసింపవలె నేడు విజ్ఞానశాస్త్ర సం
పద్విభూతి వెలార్చు వైభవమ్ము
విరజిల్లవలె నేడు విభుధవరేణ్యులౌ
కవుల కావ్యాలపై గౌరవమ్ము
వినిపింపవలె నేడు విమల గాంధర్వమౌ
శాస్త్రీయ సంగీత స్వరవరాళి
తే.గీ.
సర్వతోముఖ ప్రతిభయు శ్రద్ధ తోడి
బుద్ధి విరిసినయపు డభివృద్ధి కలుగ
ఆంధ్రదేశాన లలితకళానురక్తి
వరలుగాక విరోధి వత్సరమున.

రచయిత
(దూసి బెనర్జీ)
శ్రీకాకుళం
౨౭-౦౩-౨౦౦౯

3 కామెంట్‌లు:

రాఘవ చెప్పారు...

నాకు ఇందులో వరాళితో పాటు తోడి, లలిత కూడా కనబడుతున్నాయండీ. భలే! :)

amma odi చెప్పారు...

మీక్కూడా మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

పరిమళం చెప్పారు...

మీకు ,మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు .

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates