తేట తెలుగు వెలుగుల
తేనెలొలుకు పలుకుల
స్వేచ్ఛా చందస్సుల
భావాంబర వీధుల
విశ్రుత విహారాల
గంగా నిర్ఘర తరంగాల
నందనోద్యాన మందాకినీ తీరాల
నటరాజమూర్తి అందెల మువ్వల సవ్వడుల
నగరాజపుత్రి నాట్యవిలాసాల
శ్రీ వాణి వీణా నిక్వణముల
నారదుని మహతి నిస్వనముల
బాలగోపాలుని మురళీ నాదాల
సరిగమపదని సప్తస్వరముల
నానామృత రసధారల
స్వరగాన సుధా లహరుల
'రసమయ' ఆంధ్ర సంస్కృతి వైభవాల
కవిబ్రహ్మ కలం తిక్కనల
'కోడి' వారి కవితా సోయగాల
అపూర్వ ఆహ్వాన గీతికల
అపురూప ఆత్మీయత అభిమానాల
అందించిన మమతా సురాగాల
అలరించిన స్నేహవాత్సల్యాల
కవితా మైత్రీ బాంధవ్యాల
మందార మకరంద మాధుర్యాల
దుబాయ్ పారిజాత పుష్పాల
సురభిళ సుగంధ పరిమళాల
అందుకొన్న మా అందరి హృదయాల
నిండిన ఆనందోత్సాహాల
పండిన మధుర మనోజ్ఞ భావనల
తెలియజేయుటకు కృతజ్ఞతల
"ల" సువర్ణాక్షర అంత్య ప్రాసల
శ్రీకాకుళ కళా ప్రాభావాల
సర్వదా 'మీ' వేదుల బాల
---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
skip to main |
skip to sidebar
తెలుగు పద్యానికి నా నైవేద్యం
లంకె బిందెలు
మిత్రులు
నా గురించి
Labels
- ఆంధ్రభాష (5)
- ఆంధ్రభాష. పద్యం (1)
- ఆటవెలది (1)
- ఉగాదులు (5)
- ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు (1)
- కవయిత్రి మొల్ల (1)
- గురుపూజ (1)
- త్యాగయ్య (2)
- దసరా పద్యములు (1)
- దీపావళి (1)
- పండుగలు (2)
- పద్యములు (4)
- పరిచయం (5)
- పాటలు (3)
- ప్రపంచ వయోవృద్ధులు (1)
- ప్రముఖులతో నా పరిచయాలు (5)
- లలిత కళలు (1)
- శారదా మాత (1)
- శివమానసపూజా రాగరత్న సీసమాలిక (1)
- సమస్యా పూరణలు (4)
- స్మృత్యంజలి (2)
1 కామెంట్‌లు:
ఈ template బాగుంది. హరేకృష్ణ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి