తెలుగు పద్యం
ఉ.
పద్యము తెల్గువారలకు భాగ్యఫలంబుగ లభ్యమౌటచే
గద్యము కన్న నెక్కుడగు గౌరవమిచ్చుచు పండితోత్తముల్
సేద్యము సేయరే హృదయ సీమల యందున; హృద్యపద్య నై
వేద్యము నిత్తు గైకొనుడు-వేడుక మీరఁగ ఆంధ్ర సోదరుల్.
చ.
పలుకు వెలంది ఆంధ్రి పద భంగిమ లాస్య నిబద్ధ మౌట రా
చిలుకలు పల్కరించినటు చిప్పిలు తేనెలు పల్కు పల్కునన్
పలుకుల రాణి ఆంధ్రి యని పండితులెల్లరు ప్రస్తుతింపగా
పలికిన పల్కులన్నియును పద్యము లయ్యె తెలుంగు నాడునన్.
skip to main |
skip to sidebar
తెలుగు పద్యానికి నా నైవేద్యం
లంకె బిందెలు
మిత్రులు
నా గురించి
Labels
- ఆంధ్రభాష (5)
- ఆంధ్రభాష. పద్యం (1)
- ఆటవెలది (1)
- ఉగాదులు (5)
- ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు (1)
- కవయిత్రి మొల్ల (1)
- గురుపూజ (1)
- త్యాగయ్య (2)
- దసరా పద్యములు (1)
- దీపావళి (1)
- పండుగలు (2)
- పద్యములు (4)
- పరిచయం (5)
- పాటలు (3)
- ప్రపంచ వయోవృద్ధులు (1)
- ప్రముఖులతో నా పరిచయాలు (5)
- లలిత కళలు (1)
- శారదా మాత (1)
- శివమానసపూజా రాగరత్న సీసమాలిక (1)
- సమస్యా పూరణలు (4)
- స్మృత్యంజలి (2)
3 కామెంట్‌లు:
...ఆంధ్ర సోదరుల్..
ఇది ఆంధ్ర "సోమరుల్" అని ఉంటే బాగుండేది ;-)
మీ బాధ అర్థమయ్యింది.కాని --తప్పు--తప్పు--'ఆంధ్ర సోదరుల్' యే న్యాయమయిన పదం.
చాలా బాగుంది. తాత్పర్యం అర్థం అవుతుంది కాని ప్రతి పదం యొక్క అర్థం అర్థం కాలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి