సమస్యా పూరణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమస్యా పూరణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సమస్యా పూరణలు

  సమస్యాపూరణలు
1. వేళ కాని వేళ వేంకటేశ
2. ఉపయోగించని వరములు ఉచ్చై తోచున్

ఆ.వె.|| వేళకానివేళ వేంకటేశ హరి! నీ
పాదపద్మములకు ప్రణతులొసగ
వచ్చినాను; తెరను ప్రక్కకు తొలగించు
మదిని కప్పి వున్నమత్సరమను
ఆ.వె.|| సరసమాడుటకును సమయములున్నవి
రేయి ఎల్ల గడచిపోయె; ఇపుడు
మంగతోడ సరసమాడ విచ్చేసితే
వేళకానివేళ వేంకటేశ
 
కం.|| ఉపయోగపడని వరములు
అపహాశ్యము పాలగుచును అదృశ్యమగున్
ఉపమింపగ మృగతృష్ణలె
ఉపయోగించని వరములు ఉచ్చై తోచున్ !

రచన: వేదుల బాలకృష్ణమూర్తి
వ్రాయసకాడు : మల్లిన నరసింహారావు

సమస్యా పూరణలు

కం||     పేకాట వ్యసన పరులీ
లోకంబును మరతురనెడి లోకపుతీరున్
లోకజ్ఞులు తెల్పవినమె;
పేకాటాడుచు వివాహ పేరంటమెలా?
 
 
తే.గీ.||    దేహి తనకున్న కాంక్షలు తీర్చు కొరకు
హరిహరి యనుచు శ్రీహరి శ్మరణ సేయ
భక్త సులభుడు ఆశ్రిత వత్సలుండు
దేవుడే దిగివచ్చును దేహమున్న

దొంగ కాని వాడు దున్నపోతు

సమస్యా పూరణలు.
దొంగ కాని వాడు దున్నపోతు

ఆ.వె.|| నేర్పు విద్య యందు నిపుణతకై పని
దొంగ కాని వాడు దున్నపోతు
వలెను కష్టపడిన ఫలితము అనుభవించు
బాలకృష్ణ మాట పసిడి మూట
 
ఆ.వె.|| దున్నపోతు నేల దున్నగ కష్టించు
దొంగతనము చేయు దొంగ,  కాని
వాడు దున్నపోతువలెను శ్రమించడు
తెలుగు కవితలోని జిలుగులెవియె

సెల్లుఫోనువల్ల చేటువచ్చె

సిలికానాంధ్రవారి సుజనరంజనిలో ప్రచురించబడ్డ నా సమస్యాపూరణ పద్యాలు
ఆ।వె||
స్కూటరెక్కి పోవుచుండెడి సమయాన

సెల్లుమ్రోగె; ఒంటిచేతి తోడ

బండి నడుప ఎదుటిబండిని ముద్దాడె

సెల్లుఫోనువల్ల చేటువచ్చె

కం||
పూరము రససంభరితము

పారము లేనట్టిరుచిరభావార్ధవచో

సారము తేట తెలుగు నుడి

కారమెయనిపించు తీపికలకండవలెన్


పుల్లెల శ్యామసుందర్గారిచ్చిన న్యస్థాక్షరికి -- వేదుల బాలకృష్ణగారు పూరించిన పద్యం

1వ పాదములో 3 వ అక్షరము 'జ"

2వ పాదములో 5వ అక్ష్రము 'వా

3వ పాదములో 7వ అక్ష్రము 'హా

4వ పాదములో 9వ అక్ష్రము 'రూ

వచ్చునట్లుగా ఉత్పలమాలలో నెహ్రూ శాంతిప్రియత్వమును వర్ణిచాలి

పూరణ ఇలా సాగింది

ఉ||

మేటిజవహరుండు జగమెల్లను శాంతిగూర్పనెంచిదే

శాటనచే వరిష్ఠులను సంఘటితంబొనరించి వర్గపో

రాటములేని స్నేహయుత రాజరికాలవ్యవస్థనిల్పె ఈ

కూటమి నిత్యమై తనరుకోరిక తీరును శాంతిదూతకున్



 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates