స్వ విషయం

పేరు :వేదుల బాలకృష్ణ మూర్తి
జననము :15ఫిబ్రవరి, 1918
స్వస్థలం :శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం,లుకులాం అగ్రహారం గ్రామం.
హైస్కూలు విద్య :మున్సిపల్ హైస్కూల్,శ్రీకాకుళం(1926-1934)
ఇంటర్మీడియట్ విద్య :ప్రైవేటు విద్యార్థి;ఆంధ్రా యూనివర్సిటీ(1957)
బి.ఎ(స్పెషల్ తెలుగు:ప్రైవేటు విద్యార్థి;ఆంధ్రా యూనివర్సిటీ(1960)
ఉద్యోగము :1942-1976
సౌత్ ఈస్టరన్ రైల్వేలో స్టేషను మాష్టరు,సెక్షను కంట్రోలరు,కమర్షియల్
ఇన్స్ ట్రక్టరు(ఒరిస్సా,మధ్యప్రదేశ్,బీహార్లలో)
పదవీ విరమణ :1976
అభిమాన విషయములు:ఆంధ్రభాషా సాహిత్యములు,ఛందోబద్ధమైన పద్య కవిత్వము,
కర్ణాటక సంగీతము, కవిసమ్మేళనములో పాల్గొనుట,అష్టావధాన,శతావధానములలో
పృచ్ఛకునిగా పాల్గొనుట,సమస్యా పూరణలలో పాల్గొనుట(రేడియో,టి.వి),
సంగీత సాహిత్య ఆధ్యాత్మిక విషయములపై వ్యాసరచన,పద్యరచన.
గ్రంధ రచన :వాగ్గేయకార కళావైభవము సంగీత రూపకము
భువన విజయమును పోలిన సంగీత భువనవిజయము ఇది.శాస్త్రీయ సంగీతమునకు
ఆద్యులైన పదిమంది వాగ్గేయకారులు ఒకే వేదికపై ఉండి వారు రచించిన సంగీత కృతులను ఆ పాత్రధారులే శాస్త్రీయ
పద్ధతిలో గానం చేయుట ఇందులోని ప్రత్యేకత. --వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు-నరసింహ)

2 కామెంట్‌లు:

చిన్నమయ్య చెప్పారు...

శ్రీమాన్ వేదుల గారూ, నమస్సులు. ఇంత పెద్దవారు బ్లాగుల మీద ఆసక్తి చూపడం తెలు బ్లాగరుల అదృష్టం. మీ అనుభవాలూ, జ్ఞాపకాలూ మాకు తెలియజేయాలని ప్రార్ధన. నరసింహగారి పరిచయం కూడా తెలియజేయగలరు.

తత్త్వము, మహాత్మ్యము లంటి మాటలని పొల్లుపోకుండా రాస్తున్నవారు, మీ పేరులో "క్రిష్ణ" అని రాయడంలో ఆంతర్యం తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. మీరు క్రమం తప్పక టపాలు పది కాలాల పాటు రాయాలని ఆశిస్తూ, మరోసారి నమస్సులు.

Unknown చెప్పారు...

ఆ తప్పు వ్రాయసగాడి నైన నాది. అంటే నరసింహారావు మల్లినది.సరిదిద్దుతున్నాను.గమనించగలరు.
నేను మూడు బ్లాగులు వ్రాస్తున్నాను.నావి 3 మరియు వేదుల వారిది ఇక మీదట ఇద్దరి ఉమ్మడి పేర్లతో వ్యవహరింపబడతాయి.అన్నింటికి వ్రాయసగాడిని నేనే అయినా వేదుల--బాల బ్లాగులోని విషయాలు పూర్తిగా వారిచే రచించ బడినవే అయి ఉంటాయి.గమనించగలరు.
http://vedula--baala.blogspot.com
http://kasstuuritilakam.blogspot.com
http://kastuuritilakam.blogspot.com
http://mutyalasaraalu.blogspot.com

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates