"ముత్యాలసరాలు"

భాషను ప్రేమించుమన్నా
ఆంధ్రభాషను పెంచుమన్నా


భాష అంటే మాట కాదోయ్
భాష అంటే భావమోయ్


భాష యందున భావమున్నది
భావమందున భాష ఉన్నది


భాష, భావములకు
అవినాభావ సంబంధం!


సొంత లాభం కొంత మానుకు
భాషకోసం పాటు పడవోయ్
భాష అంటే మాట కాదోయ్
భాష అంటే మనుషులోయ్


భాషాభిమానం నాకుకద్దని
వట్టి గొప్పలు చెప్పబోకోయ్
నీ సేవతో భాషామతల్లికి
మేడ కట్టవోయ్


ఆంధ్రియే నిను కన్నతల్లి
ఆంధ్రయే నీ మాతృభాష
ఆంధ్రి పదముల అందమంతా
జగతికే ఎరుక


దేశభాషల తెలుగులెస్సట
అందమైనది ఆంధ్రభాషట
తేనె లొలికెడి తెలుగుభాషట
మధురమైనది మాతృభాషట


పలుకు పలుకున తెనెలొలికెడి
తెలుగుభాషకు వందనం!
జిలుగు వెలుగుల తెలుగుతల్లికి
వందనం! అభివందనం!!
శ్రీకాకుళం,
౧౧-౦౩-౨౦౦౬ --వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు--నరసింహ)

4 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఈ template లో చదవడం కొంచెం ఇబ్బందిగా వుంది. వీలయితే మార్చగలరు. హరేకృష్ణ.

Unknown చెప్పారు...

template మార్చాను.ఇప్పుడు బాగుందా?

Bolloju Baba చెప్పారు...

గర్వంగా ఉంది.
బొల్లోజు బాబా

Unknown చెప్పారు...

బాబా గారూ
వేదుల వారు ఈ నెలాఖరు రోజులలో పెద్దాపురం లో మా యింటికి వస్తున్నారు.ఈ విషయం తలచుకుంటుంటే ఎంతో ఆనందంగా వుంది.మీకు వీలుంటే, రాగలిగితే తెలియజేయండి.ఇదే మీకు నా ఆహ్వానం.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates