ఘంటసాల స్మృత్యంజలి

సీ॥
చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల
గంధర్వ మణిమాల ఘంటసాల
సంగీత సాహిత్య సరసార్ధ భావాల
గాత్ర మాధుర్యాల ఘంటసాల
పద్యాల గేయాల వచనాల శ్లోకాల
గమకాల గళలీల ఘంటసాల
బహువిధ భాషల పదివేల పాటల
గాన వార్నిధిలోల ఘంటసాల

తే॥ గీ॥
కమ్ర కమనీయ రాగాల ఘంటసాల
గళవిపంచికా శృతిలోల ఘంటసాల
గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల
గాయకుల పాఠశాల మా ఘంటసాల।
శ్రీకాకుళం
౦౭-౦౪-౨౦౦౮
--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

2 కామెంట్‌లు:

శాంతి చెప్పారు...

చాలా బాగా వర్ణించారు. ఘంటసాల పాటలాగే మీ పద్యం కూడా చదవడానికి హృద్యం గా (మంచి లయతో) ఉంది.

రానారె చెప్పారు...

అద్భుతం. శాంతిగారన్నట్లు ఘంటసాల పాటంత బాగుంది పద్యం. అద్భుతంగా వుంది.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates