సీ॥
పూలను కోయంగ పువ్వులు ఏడ్చుచు
మూగ భాషను తెల్పు పూల బాధ
కన్న సుతుని గంగ కర్పింప దిగివచ్చు
కన్యకామణి కుంతి కాళ్ళ జంకు
సంధ్య వెలుగున నారింజకు నీళ్ళిచ్చు
శసిరేఖ కట్టిన పసుపు చీర
భాగవతము వ్రాయు బమ్మెర గంటమున్
పంచదారను అద్దు భావ గరిమ
తే॥గీ॥
ఎటుల ఊహించి వ్రాసితొ!ఇట్టి సరస
భావ విలసితమగు తెల్గు పద్య కనిత!
తెలుగు వారికి తొలి జన్మ ఫలము గాగ
ప్రాప్తమైనట్టి సుకవి పాపయ్యశాస్త్రి!
తే॥ గీ॥
శ్రీ విలసితమగు కరుణశ్రీ యనంగ
పద్య కవితా యశశ్విపాపయ్యశాస్త్రి!
పద్య కవితా సుమాస్త్రి పాపయ్యశాస్త్రి!
పద్య సౌధాల మే స్త్రి పాపయ్యశాస్త్రి!
తే॥ గీ॥
పాండితీ ప్రాభవముల పాపయ్యశాస్త్రి!
పద్య కవితా పయోధి పాపయ్యశాస్త్రి!
పద్య కవితకు వెలుగు పాపయ్యశాస్త్రి!
పసిడి పలుకుల కవిత పాపయ్యశాస్త్రి!
తే॥ గీ॥
భావవీధీ విహారి పాపయ్యశాస్త్రి!
భవ్య కవితా సురఝరి పాపయ్యశాస్త్రి!
వాణి వీణా స్వరఝరి పాపయ్యశాస్త్రి!
వాణి సౌందర్యలహరి పాపయ్యశాస్త్రి!
రచన: వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
skip to main |
skip to sidebar
తెలుగు పద్యానికి నా నైవేద్యం
కరుణశ్రీ-దివ్యస్మృతి
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
on 6, అక్టోబర్ 2008, సోమవారం
లేబుళ్లు:
స్మృత్యంజలి
లంకె బిందెలు
మిత్రులు
నా గురించి
Labels
- ఆంధ్రభాష (5)
- ఆంధ్రభాష. పద్యం (1)
- ఆటవెలది (1)
- ఉగాదులు (5)
- ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు (1)
- కవయిత్రి మొల్ల (1)
- గురుపూజ (1)
- త్యాగయ్య (2)
- దసరా పద్యములు (1)
- దీపావళి (1)
- పండుగలు (2)
- పద్యములు (4)
- పరిచయం (5)
- పాటలు (3)
- ప్రపంచ వయోవృద్ధులు (1)
- ప్రముఖులతో నా పరిచయాలు (5)
- లలిత కళలు (1)
- శారదా మాత (1)
- శివమానసపూజా రాగరత్న సీసమాలిక (1)
- సమస్యా పూరణలు (4)
- స్మృత్యంజలి (2)
Blog Archive
-
►
2009
(14)
- ► సెప్టెంబర్ (1)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి