సంక్రాంతి హేల
సీ.
అత్తవారిడు కట్న మందవచ్చు నటంచు
క్రొత్త అల్లుడు చంక గ్రుద్దుకొనఁగ
పుట్టింటి వారిచ్చు పట్టుచీరలకునై
ఆడపడుచు లెల్ల రాసపడఁగ
ఉల్లమ్ము బెగ్గిల్ల అల్లు రాకఁ దలంచి
లోభి మామకు గుండె లొటుకుమనఁగ
అప్పడాల్, వడియాలు, పప్పులాదిగకూర్చు
పనులలో అత్తలు మునిగితేల
తే.గీ.
వచ్చె వచ్చెను సంక్రాంతి వచ్చెననుచు
సకలజనులకుఁ దెలిపెడి చందమునను
కూర్మి చలిగాలులను వెంట గొనుచు వచ్చె
మాసరాజంబయిన పుష్యమాసమిపుడు.
సంకలనం ---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
e mail:vedulabaalakrishnamurty@yahoo.com
మీ మీ అభిప్రాయాలు తెలియజేయగల వారి కందరికీ ముందుగా నా ధన్యవాదాలు.
శ్రీకాకుళం,
10-01-2009
1 కామెంట్‌లు:
చంకలుగుద్దుకొను, లొటుకుమను, వచ్చెవచ్చెవచ్చెననుచు మంచి తెలుగునుడులతో అమోఘమైన పద్యం చెప్పారు! :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి